ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు, బిశ్వభూషణ్ హరి చందన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
Syed Abdul Nazeer : సయ్యద్ అబ్దుల్ నజీర్ భారతదేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 3వ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆయన కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా. ఆయన 12 ఫిబ్రవరి 2023న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ పదవీ విరమణ చేసిన స్థానంలో కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్లుల్ నజీర్ నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పని చేసారు. సుప్రీంకోర్టులో అయోధ్య తీర్పు ఇచ్చిన బెంచ్ లో నజీర్ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేసారు. ఇప్పుడు ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషన్ ను చత్తస్ ఘడ్ కు బదిలీ చేసారు. ఆ స్థానంలో ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో పాటుగా మరి కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. మరి కొందరి స్థానాల్లో మార్పులు – చేర్పులూ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో కొత్తగా రమేశ్ బైస్ను నియమించారు. సీనియర్ బీజేపీ నేత సీపీ రాధాక్రిష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కైవల్యా త్రివిక్రమ్ పర్ణాయక్ గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కఠారియా నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ లఖడ్ గా ఎల్జీగా కొనసాగనున్నారు.
ఏపీ గవర్నర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న బిశ్వభూషన్ హరి చందన్ 2019 జలై 17న బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా మూడేళ్ల పదవీ కాలం ముగియటంతో ఆయన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత దాదాపు అయిదేళ్ల కాలం నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించారు. విభజించిన ఏపీకి తొలి గవర్నర్ గా బిశ్వభూషణ్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన్ను చత్తీస్ ఘడ్ కు బదిలీ చేసారు. కొత్తగా నియమితులైన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
Leave a Reply